ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు రాత్రికి దర్శనం అయ్యే అవకాశం ఉంది.
భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరుతుండగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి సర్వదర్శనం టోకెన్ లేని భక్తులకు టీటీడీ అధికారులు అనుమతి నిలిపివేశారు.అలాగే టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చిన వారిని విజిలెన్స్ పోలీసులు తిప్పి పంపుతున్నారు.రాత్రి 1.30 గంటలకు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభంకానున్నాయి.రేపటి నుంచి పది రోజులపాటు సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నారు.