సలార్1( Salaar ) మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది.డంకీ సినిమాతో( Dunki Movie ) పొలిస్తే మెరుగైన టాక్ రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.ఈ సినిమాకు వచ్చిన టాక్ విషయంలో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.సలార్1 సక్సెస్ సాధించిన నేపథ్యంలో సలార్2 శౌర్యాంగ పర్వంపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి.బాహుబలి2( Baahubali 2 ) రికార్డ్ లను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించే సినిమా ఇదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సలార్1 క్లైమాక్స్ లోని చివరి 15 నిమిషాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉండటంతో పాటు సలార్2 కు లీడ్ ఇస్తూ ఇచ్చిన ట్విస్టులు ఆకట్టుకునేలా ఉన్నాయి.సలార్2 సినిమా 2025 సంవత్సరం లేదా 2026 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.కేజీఎఫ్3( KGF3 ) కంటే ముందే ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.సలార్2 సినిమాలో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.
ఖాన్సార్ సామ్రాజ్యంలోని రాజకీయాలను ప్రస్తావిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.శృతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా కథను మలుపు తిప్పే పాత్ర కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.సలార్1 మూవీ కలెక్షన్లు ఒకింత భారీ స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సలార్1 మూవీకి చాలా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ అమలవుతుండటం గమనార్హం.క్రిటిక్స్ నుంచి కూడా సలార్ కు పాజిటివ్ టాక్ రావడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.
సలార్ మూవీ( Salaar movie ) సక్సెస్ తో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.నీల్ ఎన్టీఆర్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.