విశాఖపట్నం, న్యూ రేసపువాని పాలెం పీతల పైడయ్య జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చెప్పారు.సిటీస్ ప్రాజెక్ట్ లో భాగంగా కోటి ముప్పై లక్షల యాబై వేల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో పీతల పైడయ్య జీవీఎంసీ పాఠశాలలో స్మార్ట్ పాఠశాల పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో 31 పాఠశాలలు స్మార్ట్ పాఠశాలలుగా నిర్మాణం చేయడానికి ఎంపిక అయ్యాయన్నారు.మొదట విడతలో న్యూరేసపువాని పాలెం స్కూల్ కి 1.33 కోట్లు మంజూరయ్య యన్నారు.ఈ నిదులతో స్కూల్లో అదనపు అంతస్తులు, అధునాతన వసతులతో స్మార్ట్ తరగతి గదులు, క్రీడా మైదానం, క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించినప్పుడే వారికి మంచి విద్యను అందించగలమన్నారు.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు లేమి కారణంగా తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు మెరుగుపడాలంటే ప్రయివేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇది దృషిలో పెట్టుకుని న్యూ రేసపువాని పాలెం జీవీఎంసీ పాఠశాలను స్మార్ట్ పాఠశాలగా మార్చలని సంకల్పించామన్నారు.
న్యూ రేసపువాని పాలెం స్కూల్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందించాలని గతంలో జీవీఎంసీ కమిషనర్ కు విన్నవించామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఈఈ సుధాకర్, డిప్యూటీ ఈఈ విజయకుమార్, ఏఈ వెంకటరామరాజు, అధికారులు మురళి, రవితేజ, లలిత దేవి, రేసపువాని పాలెం ప్రధాన ఉపాద్యాయురాలు కిరణ్మయి, అంకబాబు, సచివాలయం ఎమినెట్ కార్యదర్శి కార్తీక్, ఆర్పీ భారతి, జనసేన నాయకులు పీతల మధుసూదనరావు, పెసల శ్రీను, ఒమ్మి గోవింద్, ఒమ్మి పోలరాజు, కాంట్రాక్టర్లు ప్రసాద్, గిరిసంతోష్.