దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త సబ్ వేరియంట్ జెఎన్.1 గుర్తింపు

భారత్ లో మరోసారి కరోనా( Corona ) కలకలం చెలరేగింది.ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.కేరళతో ( Kerala )పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త సబ్ వేరియంట్ జెఎన్.1( JN.1 ) ను గుర్తించింది.పండుగల సీజన్ నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.

 Corona Once Again In The Country Identification Of New Sub Variant Jn.1 Details,-TeluguStop.com

ఈ క్రమంలోనే గతంలో జారీ చేసిన కోవిడ్ -19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది.

పాజిటివ్ శాంపిళ్లు అన్నింటనీ జీనోమ్ సీక్వెన్సింగ్( Genome Sequencing ) చేయాలని తెలిపింది.అలాగే ఆర్టీ- పీసీఆర్ సహా అన్ని రకాల టెస్టులకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే జెఎన్-1 సబ్ వేరియంట్ ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించడం లేదని పేర్కొంది.ఈ నేపథ్యంలోనే ఆస్పత్రుల సన్నద్ధతపై రేపు రాష్ట్రాలతో కేంద్రం సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube