దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త సబ్ వేరియంట్ జెఎన్.1 గుర్తింపు
TeluguStop.com
భారత్ లో మరోసారి కరోనా( Corona ) కలకలం చెలరేగింది.ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కేరళతో ( Kerala )పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త సబ్ వేరియంట్ జెఎన్.
1( JN.1 ) ను గుర్తించింది.
పండుగల సీజన్ నేపథ్యంలో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.ఈ క్రమంలోనే గతంలో జారీ చేసిన కోవిడ్ -19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది.
"""/" /
పాజిటివ్ శాంపిళ్లు అన్నింటనీ జీనోమ్ సీక్వెన్సింగ్( Genome Sequencing ) చేయాలని తెలిపింది.
అలాగే ఆర్టీ- పీసీఆర్ సహా అన్ని రకాల టెస్టులకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అయితే జెఎన్-1 సబ్ వేరియంట్ ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించడం లేదని పేర్కొంది.ఈ నేపథ్యంలోనే ఆస్పత్రుల సన్నద్ధతపై రేపు రాష్ట్రాలతో కేంద్రం సమీక్షా సమావేశం నిర్వహించనుంది.
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తో విష్ణు కొత్త సినిమా.. ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇవే!