తెలంగాణలో గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహణపై వివాదం చెలరేగింది.పరీక్ష రాసే మహిళా అభ్యర్థుల నగలు నిర్వాహకులు తీయించారని సమాచారం.
ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.అయితే, ఈ విధంగా మహిళా అభ్యర్థుల నగలు తీయించడంపై బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హిందూ మహిళా అభ్యర్థులను అవమానించారని ఆరోపించారు.మైనార్టీ అభ్యర్థులను చెక్ చేయకుండా కేవలం హిందూ మహిళా అభ్యర్థులను మాత్రమే చెక్ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.