టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇండస్ట్రీ లోకి తమన్నా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దన్నర కాలం అయినప్పటికీ ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటున్నారు.తాజాగా బబ్లీ బౌన్సర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా పాన్ ఇండియా సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఎంతోమంది బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పని అయిపోయిందని ప్రస్తుతం సౌత్ సినిమాల హవా కొనసాగుతుంది అంటూ పెద్ద ఎత్తున పాన్ ఇండియా సినిమాల గురించి కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే ఈ పాన్ ఇండియా సినిమాల గురించి తమన్నా స్పందించారు.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ పాన్ ఇండియా స్టార్ డమ్ అనేది అమితాబచ్చన్, షారుక్ ఖాన్ లతోనే ముగిసిందని ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక పాన్ ఇండియా అనే పదం చాలా పెలుసైన పదం అంటూ ఈమె అసహనం వ్యక్తం చేశారు.ఈ విధంగా పాన్ ఇండియా సినిమాల గురించి తమన్నా సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి పాన్ ఇండియా సినిమాల గురించి తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి.
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.అలాగే గుర్తుందా శీతాకాలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.







