బ్రహ్మాస్త్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

 Alia Bhatt Ranbir Kapoor Brahmastra Ott Streaming Date Fix Details, Brahmastra ,-TeluguStop.com

అస్త్రావెర్స్ నేపధ్యంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలైన అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున వంటి తదితరులు కూడా నటించారు.ఇక ఈ సినిమాని తెలుగులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల చేయగా తెలుగులో కూడా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లను పూర్తి కాగా ఓటీటీలో ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.

ఈ క్రమంలోనే థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమైంది.ఇక ఈ సినిమాని నవంబర్ 4వ తేదీ డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Telugu Amitab Bachhan, Brahmastra, Brahmastra Ott, Disney Hot, Ranbir Kapoor, Al

ఇక రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కాగా రెండవ భాగం కూడా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే రెండవ భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం కావడంతో ఈ సినిమా త్వరలోనే సీక్వెల్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం నిర్మాతలు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube