బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ ఓం రౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈయన ప్రభాస్ హీరోగా రామాయణం ఇతిహాసం నేపథ్యం ఆధారంగా ఆది పురుష్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ప్రభాస్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.అదేవిధంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో ఈ టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది.
రామాయణం వంటి ఒక మహా కావ్యాన్ని యానిమేషన్ చిత్రంగా చూపించబోతున్నారని ఇందులో రాముడు రావణాసురుడి పాత్రలను పూర్తిగా మార్చేసారు అంటూ ఎంతో మంది మండిపడ్డారు.ఇలా ఈ సినిమా టీజర్ పై భారీ స్థాయిలో నెగెటివిటీ ఏర్పడింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ కి ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఈ కారును ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారు ఆ కారు ఖరీదు ఎంత అనే విషయానికి వస్తే… ఆది పురుష్ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక నిర్మాత భూషణ్ కుమార్ డైరెక్టర్ కు ఏకంగా 4.02 కోట్ల విలువ చేసే ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారును బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ కారుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.