తెలంగాణలో కాంగ్రెస్ ఫీల్డ్‌లో లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు.అధికారంలోకి రాబోమని కాంగ్రెస్ నేతలే అంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించడం లేదని బండి సంజయ్ చెప్పారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ పై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని పేర్కొన్నారు.బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.