రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ( Telangana Congress party )దానికి తగ్గట్టుగానే అనేక వ్యూహాలు రచిస్తోంది.తెలంగాణలో బీ ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం.
తామేనని కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం చేస్తుంది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన గెలుపును తమకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS ), తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇక కాంగ్రెస్, బిజెపీలు అభ్యర్థుల ఎంపిక పై పూర్తిగా దృష్టి సారించాయి.
కాంగ్రెస్ ఎప్పుడు లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా బీజేపీ ( BJP )కూడా అదే విధంగా దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
![Telugu Aicc, Brs, Pcc, Revanth Reddy, Telangana-Politics Telugu Aicc, Brs, Pcc, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/BJP-BRS-party-Telangana-elections-revanth-Reddy-Rahul-Gandhi-Sonia-Gandhi.jpg)
బిజెపి అభ్యర్థుల ప్రకటన కంటే ముందుగానే తమ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది దీనిలో భాగంగానే 30 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం .ఈ మేరకు ఫైనల్ చేసిన అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, సీఈసీకి పంపనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే,, ఇటీవల హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యుసి సమావేశం జరిగింది .ఈ సమావేశంలో కాంగ్రెస్ అనేక ఎన్నికల హామీలను ప్రకటించింది .
![Telugu Aicc, Brs, Pcc, Revanth Reddy, Telangana-Politics Telugu Aicc, Brs, Pcc, Revanth Reddy, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/pcc-chief-AICC-BJP-BRS-party-Telangana-elections-revanth-Reddy-Rahul-Gandhi-Sonia-Gandhi.jpg)
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాహుల్ , సోనియాగాంధీ ( Sonia Gandhi )లు అనేక అంశాలపై సూచనలు చేశారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ , బిజెపి లకు ధీటుగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాల పైన చర్చించారు.తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, తెలంగాణలోని అభ్యర్థుల ఎంపిక పైనా ఆచితూచి అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం 30 స్థానాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టిసారించింది.