ఏపీ సీఎం జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.8,800 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నారు.
అనంతరం స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశానికి హాజరుకానున్నారు.
తర్వాత పులివెందులకు వెళ్లనున్నారు సీఎం జగన్.ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించనున్నారు.
సాయంత్రం తిరిగి తాడేపల్లికి పయనంకానున్నారు.