వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్.. 9 కీలక హామీలు

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) విడుదల చేశారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.

 Cm Jagan Released The Ycp Manifesto 9 Key Promises Details, Ycp 9 Key Promises,-TeluguStop.com

కేవలం రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఉంటుందన్నారు.ఈ క్రమంలోనే తొమ్మిది ముఖ్యమైన హామీలతో మ్యానిఫెస్టో రూపకల్పన చేశామని పేర్కొన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు, నాడు – నేడు, మహిళా సాధికారత మరియు సామాజిక భద్రత కల్పిస్తామని తెలిపారు.

రెండు విడతల్లో పెన్షన్ ను రూ.3,500 లకు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.అక్కచెల్లెళ్లందరికీ ఇంటి స్థలాలు కొనసాగిస్తామన్నారు.అమ్మఒడి( Ammavodi ) రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.ఈబీసీ నేస్తం రూ.45 వేలు నుంచి రూ.1.05 లక్షలకు పెంచుతామన్న సీఎం జగన్ వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తామన్నారు.వైఎస్ఆర్ సున్నావడ్డీ రుణాలు రూ.3 లక్షల వరకు పెంచుతామని చెప్పారు.

వైఎస్ఆర్ చేయూత( YSR Cheyutha ) రూ.75 వేల నుంచి రూ.లక్షా 50 వేలకు పెంపుతో పాటు వైద్యం, ఆరోగ్య శ్రీ సేవలను విస్తరిస్తామని సీఎం జగన్ తెలిపారు.దాంతోపాటు వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు పెంచుతామన్న సీఎం జగన్ అమ్మఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు.మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని పేర్కొన్నారు.

ప్రతి ప్రభుత్వ కార్యలయంతో పాటు అధికారి దగ్గర మ్యానిఫెస్టో ఉందని చెప్పారు.అలాగే మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి పంపామన్న సీఎం జగన్ ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరిగా తాము ఏం చేశామన్నది ప్రజలకు వివరించామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube