వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్.. 9 కీలక హామీలు

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) విడుదల చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.కేవలం రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఉంటుందన్నారు.

ఈ క్రమంలోనే తొమ్మిది ముఖ్యమైన హామీలతో మ్యానిఫెస్టో రూపకల్పన చేశామని పేర్కొన్నారు.విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు, నాడు - నేడు, మహిళా సాధికారత మరియు సామాజిక భద్రత కల్పిస్తామని తెలిపారు.

రెండు విడతల్లో పెన్షన్ ను రూ.3,500 లకు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

అక్కచెల్లెళ్లందరికీ ఇంటి స్థలాలు కొనసాగిస్తామన్నారు.అమ్మఒడి( Ammavodi ) రూ.

15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.

ఈబీసీ నేస్తం రూ.45 వేలు నుంచి రూ.

1.05 లక్షలకు పెంచుతామన్న సీఎం జగన్ వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తామన్నారు.

వైఎస్ఆర్ సున్నావడ్డీ రుణాలు రూ.3 లక్షల వరకు పెంచుతామని చెప్పారు.

"""/" / వైఎస్ఆర్ చేయూత( YSR Cheyutha ) రూ.75 వేల నుంచి రూ.

లక్షా 50 వేలకు పెంపుతో పాటు వైద్యం, ఆరోగ్య శ్రీ సేవలను విస్తరిస్తామని సీఎం జగన్ తెలిపారు.

దాంతోపాటు వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.

లక్షా 20 వేలకు పెంచుతామన్న సీఎం జగన్ అమ్మఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని పేర్కొన్నారు.ప్రతి ప్రభుత్వ కార్యలయంతో పాటు అధికారి దగ్గర మ్యానిఫెస్టో ఉందని చెప్పారు.

అలాగే మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికి పంపామన్న సీఎం జగన్ ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరిగా తాము ఏం చేశామన్నది ప్రజలకు వివరించామని తెలిపారు.

బాలయ్య బోయపాటి కాంబో లో వస్తున్న సినిమా కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?