టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి( Mega Family ) ఎంతలా ఇంపార్టెంట్ ఉందో చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు పరిచయమై స్టార్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ వీళ్లంతా మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లే.వీళ్ళే కాకుండా మరి కొంతమంది కుర్ర హీరోలు కూడా ఉన్నారు.
మొత్తానికి టాలీవుడ్ లో హీరోలుగా ఒక రేంజ్ లో చలామణి అవుతున్నారు.ఇక వీళ్లంతా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.అలా చిరంజీవి ( Chiranjeevi ) హోదాతో అడుగుపెట్టిన వీళ్లంతా సొంత టాలెంట్ ని కూడా ఉపయోగించారు.అయితే ఈ ఫ్యామిలీ నుండి కేవలం హీరోలే కాకుండా హీరోయిన్ గా కూడా నిహారిక కొనిదెలా( Niharika ) అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
నిజానికి చిరంజీవికి ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించలేదు.పైగా చిరంజీవి కూడా వాళ్లను ఇండస్ట్రీ పరిచయం చేయటానికి ఇష్టపడలేదని తెలిసింది.
నిజానికి వాళ్లని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవటమే మంచిదని చెప్పాలి.అయితే నాగబాబు ముద్దుల కూతురైన నిహారిక కూడా మెగా సపోర్టుతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
కానీ ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.తన నటనతో మెగా ఫ్యామిలీ పరువు కూడా తీసింది.దీంతో కొన్ని సినిమాలలో మాత్రమే నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.ఇక మళ్లీ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.ఇప్పుడు మరోసారి నటిగా బాధ్యతలు చేపట్టింది.అయితే తాజాగా వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే.
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్ అడుగుపెడుతుందని వార్తలు వస్తున్నాయి.ఇంతకూ హీరోయిన్ గా అడుగుపెట్టే అమ్మాయి ఎవరో కాదు చిరంజీవి ముద్దుల మనవరాలు నివృతి.( Nivruti ) చిరంజీవి చిన్న కూతురైనా శ్రీజ పెద్ద కూతురు నివృతి.అయితే నివృతి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టటానికి ప్రయత్నిస్తుందని తెలిసింది.
అందుకు ఇప్పటి నుంచే దానికి తగ్గట్టు శిక్షణ కూడా తీసుకుంటుందట.మొత్తానికి యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన తాత చిరంజీవి పేరును నిలబెట్టే ప్రయత్నం చేయాలని చూస్తుందట నివృతి.
అయితే ఆమె ఎంట్రీ గురించి ఎంత నిజం ఉందో తెలియదు కానీ.తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆ ఫ్యామిలీ నుంచి హీరోయిన్స్ వద్దు రా బాబు అంటూ దండాలు పెడుతున్నారు.ఆ ఫ్యామిలీలో కేవలం హీరోలకే కలిసి వస్తుందని.హీరోయిన్ లకు కలిసి రాదని. దయచేసి తనని ఇండస్ట్రీకి రానివ్వదు అని అంటున్నారు.ఇక మరికొంతమంది తను మరో నిహారిక కావద్దు అని అంటున్నారు.
కానీ కొంతమంది మాత్రం చెప్పలేం నివృత్తి కూడా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో ఆమెలో అంత టాలెంట్ ఉందేమో అని సపోర్టుగా మాట్లాడుతున్నారు.