మెగా స్టార్ చిరంజీవి అభిమానులకు ఇది గుడ్ న్యూస్.ఇటీవలే కరోనా బారిన పడ్డ చిరంజీవి గత కొన్ని రోజులుగా క్వారెంటైన్ లో ఉంటున్నాడు.
కరోనా వల్ల తల్లి పుట్టిన రోజు సందర్బంగా ఆమెను నేరుగా కలిసి ఆశ్వీర్వాదం తీసుకోలేక పోయాను అంటూ బాధ పడ్డాడు.చిరంజీవి కరోనా నుండి బయట పడాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేశారు.
స్వల్ప లక్షణాలతో కరోనా తో బాధ పడ్డ మెగాస్టార్ చిరంజీవి తాజాగా కోవిడ్ నుండి బయట పడ్డారు.ఆ విషయాన్ని ఆయన సన్నిహితులు ప్రకటించారు.
చిరంజీవి కోవిడ్ నెగటివ్ గా నిర్థారణ అయ్యారు.అయినా కూడా మరో వారం పది రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
హోమ్ జిమ్ లో చిరంజీవి రెగ్యులర్ గా వర్కౌట్లు చేస్తున్నాడు.ప్రతి రోజు కూడా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
చిరంజీవి లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అందుకోసం ఈ నెల రెండవ లేదా మూడవ వారం నుండి షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు గాను దర్శకుడు మోహన్ రాజా ఏర్పట్లు చేస్తున్నాడు.
మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ను విడుదల చేసేందుకు గాను డేట్ ఫిక్స్ చేశారు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు కొరటాల ఆ సినిమాను తీసి ఉంటాడని అంటున్నారు.గాడ్ ఫాదర్ మాత్రమే కాకుండా భోళా శంకర్ సినిమా మరియు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న అనే సినిమాల్లో కూడా చిరంజీవి నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.ఇవి కాకుండా త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాను కూడా ఆయన చేయబోతున్నాడు.కోవిడ్ నుండి బయట పడ్డ చిరంజీవి మళ్లీ షూటింగ్స్ తో రచ్చ చేయడం ఖాయం.