చిన్నపిల్లల రక్షణ ఏర్పాటు చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలి.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

రోజు రోజుకు చిన్నారులపై హత్యలు- హత్యాచారాలు, కిడ్నాప్ లు పెరిగిపోవడంపై హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు.చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించిన్నప్పుడే ఈ అఘాత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చునన్నారు.

 Child Protection Acts Should Be Strictly Implemented Say Bandaru Dattatreya, Chi-TeluguStop.com

శ్రీ సాయి ఆలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చాచా నెహ్రూ పుట్టిన రోజు వేడుకల్లో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు సుమన్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

బాలోత్సవాల పేరిట చిన్నారులకు నెహ్రూ పురస్కారాలతో బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు.

దేశ తొలి ప్రధానిగా నెహ్రూ దేశానికి దిశ దశ చూపిన మహనీయులని చిన్నారులు అంటే ఎంతో ప్రేమ అని అందుకే ఆయన జన్మదినాన్ని పిల్లల దినోత్సవం గా జరుపుకుంటామని తెలిపారు.దేశ భవిష్యత్తు కు పునాదులు అని కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టకుండా ఆట పాటలతో చదువు చెప్పిన్నపుడే ప్రతిభావంతులు అవుతారని పేర్కొన్నారు.

గతంలో 18శాతం ఉన్న అక్షరాస్యత 85శాతం పెరిగిందని వంద శాతం పూర్తి కావాల్సిన అవసరం ఉందని బండారు దత్తాత్రేయ ఆకాక్షించారు.ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube