పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ స్పందించారు.కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
సెంట్రల్ హాలులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో భాగంగా సోనియా గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.న్యాయబద్ధమైన డిమాండ్ కోసం విపక్షాలు పోరాడుతున్నాయన్నారు.
కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం సభ్యులను కుట్రపూరితంగా సస్పెండ్ చేస్తూ విపక్షాల గొంతు నొక్కేస్తుందని మండిపడ్డారు.పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటన క్షమించరానిదని పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తల సమూహం చేతిలో సంపద కేంద్రీకృతమై ఉందన్న సోనియా గాంధీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటున్నాయన్నారు.ఈ సమస్యలు అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడం అత్యవసరమని స్పష్టం చేశారు.