టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) నటించిన తాజా చిత్రం సలార్.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ పేరు మారుమోగిపోతుంది.
ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు.అయితే సినిమా డిసెంబర్ 22న అనగా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని మూవీ మేకర్స్ తో పాటు సినీ విశ్లేషకులు అలాగే అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ చిత్ర యూనిట్ లో ఉంది.
అయితే మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోన్న ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ తో వస్తోన్న స్పందన చూస్తున్న తర్వాత అవసరం లేదని అనిపిస్తోంది.ఇప్పటికే హిందీ, కన్నడ, తమిళ్ భాషలలో సలార్ ( Salaar )సినిమాని బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వదిలారు.అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం వదలలేదు.
టికెట్ రేట్స్ పెంచుకోవడానికి నిర్మాతలు ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకున్నారు.రెండు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ వచ్చాక బుక్ మై షోలో ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.
అయితే ఆన్ లైన్ బుకింగ్స్ కోసం డార్లింగ్ అభిమానులతో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో బుక్ మై షోలో ఓపెన్ లో పెట్టగానే ఒక్కసారిగా టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడ్డారు.
లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నం చేయడంతో బుక్ మై షో( BookMyShow ) యాప్ సైతం క్రాష్ అయ్యింది.దీనిని బట్టి ఆన్ లైన్ తో సలార్ టికెట్స్ కోసం ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో అంచనా వేయవచ్చు.ఇక దీనిపై ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా బుక్ మై షో టీం రిప్లై ఇచ్చింది.అంతరాయానికి క్షమాపణలు చెప్పి ఇష్యూ ఫిక్స్ చేస్తున్నట్లు చెప్పింది.
అయితే సలార్ టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి.సింగిల్ థియేటర్స్ లో 175 నుంచి 250 వరకు ధరలు ఉంటే మల్టీప్లెక్స్ లలో మాత్రం 400 నుంచి 470 వరకు టికెట్ ధరలు ఉన్నాయి.
అలాగే ఐదు షోలకి కూడా పర్మిషన్ వచ్చింది.బుక్ మై షోలో ఆల్ మోస్ట్ టికెట్లు మొదటి రోజుకి సొల్ద్ హైదరాబాద్ లో సొల్ద్ అయిపోయాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో మేగ్జిమం థియేటర్స్ లో మొదటి రోజు హౌస్ ఫుల్ పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.అయితే ప్రస్తుతం టికెట్ల కోసం అభిమానులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు.
ఇదంతా చూస్తుంటే ప్రభాస్ రేంజ్ కు ఇంతకుమించి సాక్ష్యం కావాలా అని అనిపించక మానదు.