టీడీపీ జనసేన పొత్తు ? అడ్డు పడుతున్న కుల లెక్కలు ? 

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా,  2024లో గెలవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.

ఇప్పటికే పార్టీ నేతలు పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు.

వరుస ఓటములు పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అనే విషయం పైన గ్రామస్థాయి నుంచి జనాల్లో చర్చ జరుగుతోంది.

అలాగే తెలుగుదేశం పార్టీని బీజేపీ లో విలీనం చేయబోతున్నారు అనే  ప్రచారం ఊపందుకోవడంతో, టీడీపీ పై ఆశలు పెట్టుకున్న కొద్దిమంది నేతలలోనూ, మరింత కంగారు మొదలైంది ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకోవడమే ఏకైక మార్గం అని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు.ఇప్పటికే బిజెపి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీతో పొత్తు రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా బాబు అంచనా వేస్తున్నారు.

అందుకే జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుంటే సులువుగా విజయం సాధించవచ్చని నమ్ముతున్నారు.కాకపోతే కుల సమీకరణాల విషయంలో ఈ పొత్తు కారణంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు అని బాబు నమ్ముతున్నారు.

Advertisement

తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు ప్రస్తుతం వైసీపీకి మద్దతుదారుగా మారారు దాదాపు 100కు పైగా నియోజకవర్గాలను ప్రభావితం చేసే స్థాయిలో వారు ఉన్నారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ వరకు వారే కీలకం.

దీంతో చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యం పెంచే కార్యక్రమం ఎప్పుడో మొదలు పెట్టారు.

గత టీడీపీ ప్రభుత్వం బీసీలను పెద్దగా పట్టించుకోకుండా కాపుల వైపు మొగ్గు చూపడం తో బాబు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీసీల కారణంగా దెబ్బ తిన్న విషయాన్ని గ్రహించారు.అందుకే పార్టీ పదవుల్లో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు పెద్దపీట వేశారు.కానీ బీసీలు మాత్రం తమను నమ్మడం లేదనే విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు రుజువు చేయడంతో , జనసేన ద్వారా కాపులను దగ్గర చేసుకుని మళ్ళీ అధికారం వైపు అడుగులు వేయాలని చూస్తున్నారు.

పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని , ఆయన బలమైన నాయకుడిగా చూడాలని కాపు యువత భావిస్తోంది.కానీ పెద్ద వయసు లో ఉన్న కాపు సామాజికవర్గం టీడీపీ వైపు ఉండగా , మధ్య వయసు వారు వైసీపీ వైపు నిలబడ్డారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

 కేవలం కాపు యువత మాత్రమే పవన్ ను పల్లకి ఎక్కించాలని చూస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో పవన్ తో తాము పొత్తు పెట్టుకున్న, అటు బీసీ ల తో పాటు, కాపు సామాజిక వర్గం పూర్తి మద్దతు తమకు లభించదని, ఈ లెక్కన చూసుకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఇబ్బందులు ఎదుర్కోవాలనే లెక్కల్లో ఉన్నారు.

Advertisement

అందుకే పొత్తు పెట్టుకునేందుకు ఈ కుల లెక్కలే అడ్డంకిగా మారాయి.

తాజా వార్తలు