దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందనుకుంటున్న సమయంలో కర్ణాటకలో( Karnataka ) జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి.కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నాయకులంతా యాక్టివ్ అయ్యారు.
పార్టీని అధికారంలోకి తీసుకొస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.బిజెపి( BJP ) తమకు పోటీనే కాదని, బీఆర్ఎస్ తోనే తమ యుద్ధం అని ప్రకటనలు చేస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ ఇక పుంజుకునే అవకాశం అవకాశం లేదనే అభిప్రాయంతో ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడంతో, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉంది.అయితే ఏపీలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.
ఏపీ , తెలంగాణ విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో ఉనికి కోల్పోయింది.అప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలలోను కనీస ప్రభావం చూపించలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికీ నాయకత్వలేమితో కాంగ్రెస్( Congress ) ఇబ్బంది పడుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి క్యాడర్ ఉన్నా, వారిని యాక్టివ్ చేయడంలో మాత్రం ఆ పార్టీ అధిష్టానం విఫలం అవుతోంది.2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించలేకపోయింది.2024 ఎన్నికల్లోనైనా కాస్తో, కూస్తో ప్రభావం చూపిస్తుందా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఎన్నికల్లో వరుస వాటములు కాంగ్రెస్ ను మరింత దెబ్బతీశాయి.ఆ పార్టీకి ఉన్న ప్రధాన ఓటు బ్యాంకింగ్ మొత్తం కోల్పోయింది.కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన నేతలంతా సైలెంట్ అయిపోయారు.మరి కొంతమంది ఇతర పార్టీలో చేరిపోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో ఉన్నంతకాలం సైలెంట్ గానే ఉండిపోయారు.ఈ మధ్యనే ఆయన బిజెపిలో చేరి కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు.
ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సైతం రాజకీయాలతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

గిడుగు రుద్రరాజు( Gidugu Rudraraju ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపడుతూ కాంగ్రెస్ ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నా, ఆ పార్టీ అధిష్టానం పెద్దలు మాత్రం ఏపీలో కాంగ్రెస్ వ్యవహారంపై అంతగా ఆసక్తి చూపించడం లేదు.కనీసం ఏపీలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ అగ్ర నేతలు దానికి హాజరై , పార్టీలో జోష్ ప్రయత్నం చేయడం లేదు.
పైగా ఏపీలో కాంగ్రెస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదంటూ మాజీ ఎంపీ చింత మోహన్ వెల్లడించారు.

పార్టీ అధికారంలోకి వస్తే తొలి రెండున్నరేళ్లు ఎస్సీలకు , ఆ తర్వాత రెండున్నరేళ్ళు కాపులకు సీఎం పదవి ఇస్తామంటూ ఆయన ప్రకటన చేశారు .అసలు కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా ? ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత స్థాయిలో బలం ఉందా అనే విషయాన్ని పక్కన పెట్టి గంభీరంగా మాత్రం ప్రకటనలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.కర్ణాటక , తెలంగాణ తరహాలో ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే పూర్తిగా ఏపీలో కాంగ్రెస్ పై ఆశలు వదులుకోవాల్సిందే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.