కృష్ణా జిల్లా గన్నవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది.బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్, జీవీఎల్, వాకాటి, మాధవ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
అయితే ఇతర కార్యక్రమాలు ఉన్న కారణంగా కేంద్రమంత్రి మురళీధరన్ ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.కాగా భేటీలో ఏపీలో బీజేపీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేస్తున్నారు.వైసీపీ సర్కార్ పై దశల వారీగా ఛార్జిషీట్లు విడుదల చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందని సమాచారం.







