కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఒక శకం అనే చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అంత బలం పెరిగిందంటే అది వైఎస్ మహిమే అని ఇప్పటికీ నమ్ముతుంటారు.
అసలు విమర్శించేందుకు కూడా అవకాశం లేదని ఇప్పటికీ పార్టీలకు అతీతంగా ఆయన్ను కొలుస్తుంటారు.అంతటి చరిష్మా ఉన్న నేత కాబట్టే ఆయన పేరు చెప్పుకుంటే జగన్ సీఎం అయ్యారు.
ఇప్పుడు అదే పేరును వైఎస్ షర్మిలమ్మ తెలంగాణలోనూ వాడబోతున్నారు.
మరి కాంగ్రెస్‌కు ఇంత గుర్తింపు తెచ్చిన వైఎస్సార్ పేరును మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పక్కన పెట్టేసింది.
ఆయన్ను తలుచుకుంటే తెలంగాణలో గుర్తింపు ఉండదని భావించి కనీసం ఆయన చేసిన సేవలను కూడా ఎప్పుడు కాంగ్రెస్ గుర్తు చేసుకోలేదు.కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో మళ్లీ వైఎస్సార్ పేరు మార్మోగిపోతోంది.
దీంతో ఎక్కడ వైఎస్సార్ అభిమానులు షర్మిల వైపు మళ్లుతారో అని కాంగ్రెస్ నేతలు అలర్ట్ అవుతున్నారు.

మొన్నటి వరకు రేవంత్ మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని చెప్పాడు.కానీ ఇప్పడు మరో కీలక నేత అయిన జీవన్ రెడ్డి వైఎస్సార్ భజన చేస్తున్నారు.అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను మిస్ అవకుండా తనను ఏ పార్టీ నేతలు విమర్శించేందుకు అవకాశం ఇవ్వకుండా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇంకోవైపు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ వైఎస్సార్ హయాంలో చేపట్టలేదని చెబుతూనే ఆ ప్రాజెక్టు తెలంగాణకు నష్టం చేస్తుందని చెప్తూ తెలంగాణ సెంటిమెంట్ ను కూడా ఫాలో అవుతున్నారు.మొత్తానికి వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్ నుంచి వెళ్లకుండా చూసేందుకు వైఎస్ భజన మొదలు పెట్టారు.
అయితే ఈ భజన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల్లో మరింత పెరగటం తథ్యం అని చెప్పాలి.ఇప్పుడు రేవంత్ కూడా వైఎస్సార్ భజన చేస్తుండటంతో కార్యకర్తలు కూడా ఆయన నినాదం ఎత్తుకునే ఛాన్స్ ఉంది.