ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ ఆసక్తికరంగా మారుతున్నాయి.ఈ సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YCP chief YS Jagan )గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే ఈసారి 175 స్థానాల్లో విజయం సాధించి ఏపీ చరిత్రలోనే తిరుగులేని విజయాన్ని అందుకోవాలని అయన టార్గెట్ గా పెట్టుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రణాళికలు కూడా అదే దిశగానే ఉన్నాయి.
ఇప్పటికే స్కామ్ లతో టీడీపీకి చెక్ పెట్టడంలో సక్సస్ అయ్యారు.ఇప్పుడు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
![Telugu Mlas, Ap, Jagans Strategy, Census, Venu, Ycp Ys Jagan, Ys Jagan-Politics Telugu Mlas, Ap, Jagans Strategy, Census, Venu, Ycp Ys Jagan, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Caste-calculation-Jagans-sure-strategyb.jpg)
మరోవైపు అందరికంటే ముందుగానే బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టె ఆలోచనలో జగన్ ఉన్నారట.ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం, మా తోడు నువ్వే జగన్ వంటి కార్యక్రమాలతో ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రజల మద్య ఉంచారు.కాగా ఆయా నియోజిక వర్గాలలోని ఎమ్మెల్యేల పట్ల ఎంత అసంతృప్తిగా ఉన్నారో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా అందరికీ తెలిసింది.దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు కూడా జగన్ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
![Telugu Mlas, Ap, Jagans Strategy, Census, Venu, Ycp Ys Jagan, Ys Jagan-Politics Telugu Mlas, Ap, Jagans Strategy, Census, Venu, Ycp Ys Jagan, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Caste-calculation-Jagans-sure-strategyc.jpg)
ప్రజల మద్దతు పొందాలని లేదంటే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు కూడా.ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై త్వరలోనే కసరత్తులు మొదలు పెట్టబోతున్న జగన్.ప్రజా సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరిపే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో కొత్తగా రాష్ట్రంలో కులగణన, జనగణన చేపట్టబోతున్నట్లు మంత్రి వేణు( Minister Venu ) ఇటీవల అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.
దీంతో ఇప్పటికిప్పుడు కుల, జనగణన అవసరమేముంది అనే చర్చ మొదలైంది.అయితే ఇందులో రాజకీయ వ్యూహం ఉందనేది కొందరి వాదన.కుల గణన ఆధారంగా ఆయా నియోజిక వర్గాలలో బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఓ అంచనకు వచ్చేందుకే అనేది కొందరి అభిప్రాయం.ఇందులో నిజం కూడా లేకపోలేదు.
మరి వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్న జగన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.