తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )చుట్టూ నడుస్తున్న కేసుల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.ఏ ముహూర్తన స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యరో.
అప్పటి నుంచి వరుసబెట్టి స్కామ్ లు తెరపైకి వస్తూనే ఉన్నాయి.ఇప్పటికే స్కిల్ స్కామ్ లో నిందితుడిగా రిమాండ్ ఎదుర్కొంటున్న బాబు.
మరో మూడు నాలుగు కేసులు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి.అటు బెయిల్ కోసం జరుగుతున్నా ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించడం లేదు.
ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ పై కోర్టులో పిటిషన్ల పర్వం కొనసాగుతోంది.
![Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Tdp-Politics Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Tdp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababu-Naidu-TDP-YCP-politics-Nara-Lokesh-CM-jagan.jpg)
చంద్రబాబు ఎస్ఎల్పి పై సుప్రీం కోర్టు విచారణను వచ్చే నెల 3కి వాయిదా వేసింది.ఇక బెయిల్ కస్టడీ పిటిషన్ కు సంబంధించి ఏసీబీ కోర్టు విచారణను వచ్చే నెల 4కి వాయిదా పడింది.ఇక ఇటీవల తెరపైకి వచ్చిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో బాబు ముందస్తు బెయిల్ పై శుక్రవారనిక్ వాయిదా పడింది.
ఇలా లెక్కకు మించిన కేసులు, విచారణలతో బాబు సతమతమౌతున్నారు, అసలు ఇలాంటి పరిస్థితుల్లో బాబుకు బెయిల్ సాధ్యమయ్యే పనేనా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
![Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Tdp-Politics Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Tdp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababu-Naidu-TDP-YCP-politics-Nara-Lokesh.jpg)
ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసుల అంశం చూస్తుంటే.ఒకటి తప్పిన మరోటి చంద్రబాబు ( Chandrababu Naidu ) చుట్టూ ఉచ్చు బిగించే అవకాశాలే ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఎన్ని ఇలాంటి నేపథ్యంలో అధినేతను కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.స్కిల్ స్కామ్ వరకు అంగల్లు దాడి వరకు అన్నీ కేసులు కోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి.
విచారణ జరిగిన ప్రతిసారి చంద్రబాబుకు ప్రతికూల పరిస్థితులే ఎదురై వాయిదాల పర్వం నడుస్తోంది.కాగా వాయిదాల గడుపు పూర్తి అయిన తరువాతనైనా తుది తీర్పు వెలువడి చంద్రబాబుకు బెయిల్ వస్తుందా అంటే చెప్పలేమనే సమాధానాలు వినిపిస్తున్నాయి.
దీంతో అపార చాణక్యుడిగా పేరు గాంచిన బాబుకు ప్రస్తుతం గడ్డుకాలం ఎదురైందనే వాదనలు వస్తున్నాయి.మరి చంద్రబాబు వీటన్నిటిని దాటుకొని ఎప్పుడు వయటకు వస్తారో చూడాలి.