టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘యువగళం’ పాదయాత్రపై కేసు నమోదైంది.చిత్తూరు జిల్లాలోని నరసింగరాయినిపేటలో అనుమతి లేకుండా మీటింగ్ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ సహా పలువురు టీడీపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది.188, 341, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.