సినిమా స్టార్స్ అంటేనే.చాలా మంది లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు.
ఉండే ఇల్లు.తినే తిండి, తిరిగే వాహనాలు, వేసుకునే బట్టలు అన్నీ చాలా రిచ్ గా ఉంటాయి.
తమ రేంజ్ కి తగిన విధంగా ఆయా వస్తువులు, దుస్తులు, ఆభరణాలు వాడుతుంటారు.అందుకే వారికి సంబంధించిన పలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తాయి.
అందులో భాగంగానే కొందరు హీరోయిన్లు ధరించిన డ్రెస్సుల ఖరీదు చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే.భాలీవుడ్ భామలు ఆయా సందర్భాల్లో వేసుకున్న బట్టల ధరలు ఎంతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్ తన పెళ్లి సందర్భంగా అత్యంత విలువైన చీర కట్టుకుంది.దీని ఖరీదు రూ.75 లక్షలు.అప్పట్లో ఈమె చీరపై పెద్ద చర్చ జరిగింది కూడా.
ఆ తర్వాత బాలీవుడ్ క్యూటీ బ్యూటీ శిల్పా శెట్టి కూడా తన పెళ్లిలో విలువైన డ్రెస్ వేసుకుంది.ఆమె ధరించిన స్వరోస్కి క్రిష్టల్ తో కూడిన డ్రెస్ కి ఏకంగా 50 లక్షల రూపాయలు అయ్యిందట.
తరుణ్ తాహిలియాన్ అనే డిజైనర్ ఈ డ్రెస్సును డిజైన్ చేశాడట.మరో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సైతం తన పెళ్లిలో 30 లక్షల విలువైన సవ్యసాచి డిజైన్ లెహంగా వేసుకుంది.ఇక ప్రియాంక చోప్రా పెళ్లి సందర్బంగా డైమండ్ జెరీతో తయారుచేసిన డీప్ నెక్ డ్రెస్ వేసుకుంది.దీని విలువ రూ.77 లక్షలని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమా షూటింగులతో పాటు పలు సార్లు దుబాయ్ కి వెళ్లినప్పుడు ఊర్వశి రౌతాలా చాలా విలువైన దుస్తులు వేసుకునేది.ఆమె దుస్తుల ఖరీదు 37 కోట్ల రూపాయలట.అటు మిస్ యూనివర్స్ 2021లో జడ్జిగా ఈమె పాల్గొన్నప్పుడు రూ.40 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన నల్లరంగు దుస్తులు వేసుకుందట.2019లో దీపికా పదుకునే వేసుకున్న ఓ డ్రెస్సు ఖరీదు రూ.50 లక్షలట.దీన్ని తయారు చేయడానికి 160 గంటలు పట్టిందట.