బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో అఖిల్ సార్థక్ ఒకరు.మోనాల్ తో సన్నిహితంగా మెలగడం ద్వారా వార్తల్లో నిలిచిన అఖిల్ తన తండ్రి పుట్టినరోజున అదిరిపోయే కానుక ఇచ్చారు.
బిగ్ బాస్ షోకు ముందు పలు సీరియళ్లలో నటించినా పెద్దగా గుర్తింపును సొంతం చేసుకోని అఖిల్ బిగ్ బాస్ షో తర్వాత క్రేజ్ ను అంతకంతకూ పెంచుకున్నారు.
మోనాల్, అఖిల్ జంటగా ఒక వెబ్ సిరీస్ ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.
కొన్నిరోజుల క్రితం సొంతంగా కారును కొన్న అఖిల్ సార్థక్ తాజాగా తండ్రికి కారును బహుమతిగా ఇచ్చారు.తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో ఈ విషయాలను అఖిల్ పంచుకోవడం గమనార్హం.
తండ్రికి కారును బహుమతిగా ఇవ్వడం గురించి అఖిల్ చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తండ్రి పుట్టినరోజు కానుకగా అఖిల్ ఈ బహుమతిని ఇచ్చారు.
తండ్రి తన సూపర్ హీరో అని తండ్రి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని అఖిల్ చెప్పుకొచ్చారు.ఈ విషయాలు చెబితే తండ్రి నమ్ముతారో లేదో అని కారు కొన్నానని అఖిల్ సార్థక్ వెల్లడించారు.
చిన్నప్పుడు తండ్రి తనకోసం సైకిల్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని మరెన్నో బహుమతులను ఇచ్చాడని అఖిల్ సార్థక్ పేర్కొన్నారు.
తండ్రికి తాను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవని తండ్రి చేసినవన్నీ తిరిగి చేయలేకపోయినా తండ్రిని సంతోషంగా ఉంచడానికి తన వంతు ప్రయత్నిస్తానని అఖిల్ అన్నారు.తండ్రికి కారు కొనివ్వడం తన కల అని ఆ కల నెరవేరడంతో చాలా సంతోషంగా ఉందని అఖిల్ చెప్పుకొచ్చారు.తండ్రిని తలెత్తుకునేలా తాను చేస్తానని అఖిల్ పేర్కొన్నారు.
తండ్రికి అఖిల్ కారును బహుమతిగా ఇవ్వడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
బిగ్ బాస్ షో ద్వారా పెరిగిన క్రేజ్ ను అఖిల్ ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాల్సి ఉంది.సినిమాలు, సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా అఖిల్ కు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.అఖిల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.