బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీ( Bhagavanth Kesari ) భారీ లెవెల్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.నాలుగు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోగా ఈ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
గంటకు 11000 టికెట్ల చొప్పున ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాలయ్య( Balakrishna ) బాక్సాఫీస్ వద్ద లెక్క సరి చేస్తున్నాడని మరి కొందరు చెబుతున్నారు.

బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాలయ్యకు ఏ రేంజ్ హిట్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.బాలయ్య బాబీ కాంబో మూవీ కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
బాబీ( Director Bobby ) ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా బాలయ్యతో సినిమాను పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో బాబీ ప్లాన్ చేశారు.ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారో సింగిల్ రోల్ లో కనిపిస్తారో క్లారిటీ రావాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమాకు రోజుకు 10 కోట్ల రూపాయలకు( Bhagavanth Kesari Collections ) అటూఇటుగా కలెక్షన్లు వస్తున్నాయి.భగవంత్ కేసరి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండటం ప్లస్ అయింది.శ్రీలీల నటించడం ఈ సినిమాకు వరమైంది.కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించడం లేదని తెలుస్తోంది.ఈ సినిమా సక్సెస్ తో శ్రీలీల( Sreeleela ) కెరీర్ గ్రాఫ్ మారిపోనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ముందువరసలో ఉన్నారు.