తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్( Maharashtra Premier League ) లో సంచలన ఇన్నింగ్స్ నమోదు అయ్యింది.సోమవారం ఈ లీగ్ లో భాగంగా ఈగిల్ నాసిక్ టైటాన్- పుణేరి బప్పా ( Eagle Nashik Titan- Puneri Bappa )మధ్య మ్యాచ్ జరిగింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఈగల్ నాసిక్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.ఈగల్ నాసిక్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ అర్షిన్ కులకర్ణి సెంచరీ తో సరికొత్త రికార్డు సృష్టించాడు.కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు.54 బంతుల్లో 3 ఫోర్లు, 13 సిక్స్ లతో 216.67 స్ట్రైక్ రేట్ తో 117 పరుగులు చేశాడు.అయితే ఇందులో ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 90 పరుగులు చేయడం గమనార్హం.
ఇక ఈగల్ నాసిక్ టైటాన్స్ మరో బ్యాటరీ అయిన రాహుల్ త్రిపాఠి( Rahul Tripathi ) 28 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేసి రాణించాడు.మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు.203 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పుణేరి బప్పా గెలుపు కోసం దీటుగానే అద్భుత ఆటను ప్రదర్శించింది.చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణేరి బప్పా ఓటమి పాలైంది.
చివరి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ఐదు పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది.ఇక పుణేరి బప్పా టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్( Ruthuraj Gaikwad ) 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
కేవలం ఒక్క పరుగు తేడాతో ఈగల్ నాసిక్ టైటాన్స్ విజయం సాధించింది.
అయితే దేశవాళి క్రికెట్ లలో తమ ప్రతిభను చూపిస్తే, భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టులో చోటు దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలామంది ఆటగాళ్లు తమ ఆటను సరికొత్త రీతిలో ప్రదర్శించి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.ప్రస్తుతం గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపించిన అర్షత్ కులకర్ణికు సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.