దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది.ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడిని అధికారులు అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో మాగుంట రాఘవను ఈడీ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.
ఆయనను మధ్యాహ్నం ఈడీ న్యాయస్థానంలో హాజరుపర్చనుంది.కాగా మద్యం కుంభకోణంలో ఐదు రోజుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు అధికారులు.