Babu No.1 Bullshit Guy Review : బాబు నెం. 1 బుల్ షిట్ గయ్ మూవీ రివ్యూ.. నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అర్జున్ కళ్యాణ్( Arjun Kalyan ) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈయన హీరోగా నటించిన బాబు నెంబర్ 1 బుల్ షిట్ గయ్( Babu No.1 Bullshit Guy ) అనే సినిమా నేడు మార్చి8 వ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు ( Kushitha Kallapu ) జంటగా… లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు.మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా కథ ఏంటి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

 Arjun Kalyan Kushitha Kallapu Babu No 1 Bullshit Guy Movie Review And Rating De-TeluguStop.com

కథ:

కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చే అబ్బాయిగా కనిపిస్తారు.ఇక ఈయన ఇండియాకి తిరిగి వచ్చిన సమయంలోనే కరోనా రోజురోజుకు పెరుగుతున్నటువంటి తరుణంలో ఈయన సిటీకి బయట ఉన్నటువంటి తన విల్లాలో ఉండాలని తన తండ్రి (రవి వర్మ) చెబుతారు.ఈ క్రమంలోనే కార్తీక తన ప్రేయసి కుషిత (కుషిత కల్లపు) తో కలిసి అదే జిల్లాలో ఉండాలని అనుకుంటారు.

త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని భావిస్తారు.ఇక లాక్ డౌన్ కావడంతో వీరిద్దరూ ఆరు నెలలకు సరిపడే సరుకులను తెచ్చుకొని అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తుంటారు అయితే అనుకోకుండా ఈ విల్లాలోకి

Telugu Arjun Kalyan, Arjunkalyan, Babubullshit, Ravi Varma-Movie

ప్లంబర్ రూపంలో వచ్చిన సోంబాబు(ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ విల్లాలో బంధించి ఆ బంగ్లాలో సెటిల్ అయిపోతారు.మరి ఇలా బంధించబడిన కార్తీక్, కుషితలు ఎలా బయటపడ్డారు? వారు బంధించబడటానికి గల కారణాలు ఏంటి? అసలు సోంబాబు ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:

ఈ సినిమాలో కార్తీక్ పాత్రలో( Karthik Role ) ఒక రిచ్ అబ్బాయిగా అర్జున్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా నటించారు ఇక కుషిత( Kushitha ) కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.డైరెక్టర్ కూడా అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

Telugu Arjun Kalyan, Arjunkalyan, Babubullshit, Ravi Varma-Movie

టెక్నికల్:

దర్శకుడు లక్ష్మణ్ అద్భుతమైన కథను రాసుకున్నారు.కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని చెప్పాలి ఈ సినిమాటోగ్రఫీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది.పవన్ సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది.

నిర్మాత దిలీప్ కుమార్( Producer Dilip Kumar ) ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు.నిర్మాణాత్మక విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ:

కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టిన సమయంలో తన ఇంటి వద్దకు వచ్చిన పిచ్చుకలను చూసి ఇన్ స్పైర్ అయ్యి రాసుకున్న ఓ చిన్న పాయింట్ మీద కథ స్క్రీన్ ప్లేను చాలా ఆసక్తికరంగా రాసుకుని తెరకెక్కించారు.ఓ అందమైన జంటను బంధించి తన కుటుంబంతో ఎంతో లగ్జరీగా గడిపే వ్యక్తిగా ఈయన కనిపించారు అయితే ఈయన ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం కలదు అని నిరూపించారు తన ముందు ఎన్నో విలువ చేసే వజ్ర వైడుర్యాలు ఉన్నప్పటికీ అవక్కర్లేదని కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు.

చివర్లో చిన్న మేసేజ్ కూడా కార్తీక్ బాబు వాయిస్ రూపంలో ఇస్తుంది.ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రాక్ తో మొదలై… సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలను అద్భుతంగా చూపించారు.

Telugu Arjun Kalyan, Arjunkalyan, Babubullshit, Ravi Varma-Movie

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వడం, ఫస్ట్ హాఫ్ కామెడీ.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం.

బాటమ్ లైన్:

ఇప్పటికే కామెడీ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం ఒకవైపు కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు విలువలతో కూడినటువంటి జీవితం గురించి అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మొత్తానికి సినిమా మంచిగా అనిపించింది.

రేటింగ్ : 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube