ఏపీ రాజకీయాల్లో నారా బ్రాహ్మణి( Nara Brahmani ) యాక్టివ్ అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే టిడిపి అదినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా , ఫైబర్ నెట్ స్కామ్ లో నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
దీనికి తగ్గట్లుగానే లోకేష్ ఢిల్లీలోనే మకాం వేయడంతో అరెస్టు భయంతోనే ఆయన ఢిల్లీలో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు అరెస్టు రోజు నుంచి లోకేష్ ( Nara Lokesh )యువ గళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
మళ్లీ ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు.మరో వైపు చూస్తే ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడం, చంద్రబాబు తర్వాత లోకేష్ సైతం అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా టిడిపి నేతలు ఆంచనా వేయడంతో బ్రాహ్మణి రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
![Telugu Ap, Chandrababu, Jagan, Brahmani, Lokesh, Telugudesam-Politics Telugu Ap, Chandrababu, Jagan, Brahmani, Lokesh, Telugudesam-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/TDP-Chandrababu-jaganap-government-Nara-Lokesh-Yuvagalam-padayathra-CBN-ap-elections.jpg)
ఇప్పటికే రాజమండ్రిలో చంద్రబాబు అరెస్టు( Chandrababu )కు నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా మీడియాతో బ్రాహ్మణి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె వాక్చాతుర్యాన్ని అంతా మెచ్చుకున్నారు.ఈ నేపథ్యంలో నే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బ్రహ్మణిని టిడిపిలో యాక్టివ్ చేస్తే చంద్రబాబు, లోకేష్ కు దీటుగా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలరు అనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. గతంలో జగన్ ( CM jagan )16 నెలల జైలులో ఉన్న సమయంలో జగన్ బ్రేక్ ఇచ్చిన పాదయాత్రను ఆయన తల్లి విజయమ్మ , సోదరి షర్మిల కొనసాగించారు.
![Telugu Ap, Chandrababu, Jagan, Brahmani, Lokesh, Telugudesam-Politics Telugu Ap, Chandrababu, Jagan, Brahmani, Lokesh, Telugudesam-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Nara-Brahmani-telugudesam-TDP-Chandrababu-jaganap-government-Nara-Lokesh-Yuvagalam-padayathra.jpg)
ఇప్పుడు అదేవిధంగా లోకేష్ మధ్యలో నిలిపివేసిన యువ గళం పాదయాత్రను బ్రాహ్మణి ( Nara Brahmani )పూర్తి చేస్తారని , ఆమెతో పాటు, చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ కూడా పాల్గొంటారని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి .ఇప్పటికే యువ గళం పేరుతో దాదాపు 200 రోజులకు పైగా లోకేష్ యాత్రను పూర్తి చేశారు.ఇంకా లోకేష్ పాదయాత్ర చేయాల్సిన ప్రాంతాల్లో బ్రాహ్మణి ఆ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.అదే జరిగితే టిడిపికి మహిళల నుంచి మరింతగా ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.