ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఢిల్లీ బాట పట్టాయి.ఈ మేరకు రాష్ట్రానికి చెందిన మూడు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు.
రాష్ట్రంలో దొంగ ఓట్లతో పాటు కొత్త ఓట్ల నమోదులో స్థానిక సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.ఈ క్రమంలో మూడు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఒకే రోజు సమయం ఇచ్చిందని తెలుస్తోంది.
ఇప్పటికే వైసీపీ నేతలు ఈసీని కలువగా టీడీపీ నేతలు మరికాసేపటిలో కలవనున్నారు.అలాగే సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఈసీని కలిసి ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.