ఏపీ లో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదగాలని బిజెపి( BJP ) ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది.అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అనుకూల పరిస్థితులు బిజెపికి ఏర్పడడం లేదు.
ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పోటీ చేసిన 11 స్థానాల్లో కేవలం ఎనిమిది స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది.ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో అయినా కొన్ని స్థానాల్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలి అనే పట్టుదలతో ఉంది.
ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్న ఆ పార్టీ టిడిపి తో అధికారికంగా పొత్తు పెట్టుకుంది .దీంతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలిచే స్థాయిలో అయినా ఉండాలనే ఆలోచనతో బీజేపీ ప్రయత్నం చేస్తుంది .ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి( Daggubati Purandeswari ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం కు చెందిన కీలక నేతలంతా బిజెపిలోకి వస్తారని ఆశలు పెట్టుకుంది.అయితే ఆశించిన స్థాయిలో అయితే చేరికలు కనిపించడం లేదు .
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీ లో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు జరుగుతుంది .చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరిస్తున్నారు .ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు.దీంతో టికెట్ దక్కదని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి లు సరైన సమయం చూసి పార్టీ మారేందుకు కూడా వారు వెనకాడేలా కనిపించడం లేదు.
ఈ క్రమంలో వైసీపీ అసంతృప్తులను గుర్తించి , వారిని బిజెపి తమ పార్టీలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా దక్కించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఎలాగూ కేంద్రంలో మళ్లీ బిజెపి( BJP ) అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వస్తుండడంతో, వైసీపీలోని( YCP ) అసంతృప్తులు బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపించే ఛాన్స్ ఉంటుంది.ఈ అవకాశాన్ని బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి.