1.అఖిల ప్రియ భర్త పై మరో కేసు
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్య అతని సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి లపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.కోర్టు విచారణ నుంచి తప్పించుకోవడానికి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
2.రేవంత్ ప్రత్యేక పూజలు
నేడు పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3.యథావిధిగా డిగ్రీ పరీక్షలు
తెలంగాణ లో ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఉన్నత విద్యా మండలి అధికారులు స్పష్టం చేశారు.
4.23 నుంచి లాల్ దర్వాజ బోనాలు

జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు పాత బస్తీ లాల్ దర్వాజ బోనాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది.
5.సబిత పిటిషన్ పై కౌంటర్ వేస్తాం : సీబీఐ
జగన్ అక్రమాస్తుల కి సంబంధించి పెన్నా సిమెంట్స్ కేసులో చార్జిషీట్ నుంచి తన పేరుని తొలగించాలని కోరుతూ ఈ కేసులో నిందితురాలు , మంత్రి సబితా ఇంద్రా రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.నిబంధనల ప్రకారం నిధులు కేటాయించినట్లు తెలిపారు.
తొలుత దాఖలు చేసిన చార్జిషీట్ లో తన పేరు లేదన్నారు.దీంతో ఈ కేసులో తాము కౌంటర్ దాఖలు చేస్తామని సిబిఐ తరఫు న్యాయవాదులు చెప్పడంతో ఈ నెల 13న కేసును వాయిదా వేశారు.
6.బీసీ గురుకులాల దరఖాస్తులకు నేడే ఆఖరు

మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంగ్లీష్ మీడియం జూనియర్, మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది.
7.ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం కేసు విచారణ వాయిదా
వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి వాయిదా పడింది.ఈ కేసుకు సంబంధించిన ఫైల్ ను సర్కులేట్ చేయాలని రిజిస్ట్రీ కి సూచించిన హై కోర్టు తదుపరి విచారణను 15కు వాయిదా వేసింది.
8.హిందీ ప్రచార సభ సర్టిఫికెట్ ను గుర్తించం

దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా దూర విద్యలో విద్యార్థులు పొందిన హిందీ సర్టిఫికెట్లను గుర్తించి వద్దని దానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రతిపాదించింది.ఈ మేరకు తమ నివేదికను టిఎస్పిఎస్సి కి అందజేసింది.దీంతో ఉద్యోగాల భర్తీ ల ఈ సర్టిఫికెట్ ను పరిగణలోకి తీసుకోబోమని టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో పేర్కొంది.
9.ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
విశాఖపట్నం ఆగస్టు 16 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భారతీయ ఆర్మీ అధికార వర్గాలు తెలిపాయి.నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో 16 నుంచి 31 వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు.
10.రేవంత్ గన్ మెన్ వాంగ్మూలాలు నమోదు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గన్ మ్యాన్ వాంగ్మూలలను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని నమోదు చేసింది.
11.ప్రజా సంఘాల నిషేధం పై వెనక్కి
మావోయిస్టు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి అంటూ 16 ప్రజాసంఘాల ఏడాదిపాటు విధించిన నిషేధం ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఉత్తర్వులు జారీ చేసిన మూడు నెలల తరువాత వాటిని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది.
12.ఏపీలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు
ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.ఈరోజు బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేశారు.
13.విజయవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె

విజయవాడ దుర్గమ్మ కు ఈ నెల 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాడ సమర్పించవచ్చు అని దేవస్థానం అధికారులు తెలిపారు.
14.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 16,984 మంది దర్శించుకున్నారు.
15.ఏపీకి నేడు వర్ష సూచన

ఈరోజు ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
16.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 43, 733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.జగనన్న విద్యా కానుక పై జగన్ సమీక్ష

నాడు నేడు, విద్యా కాని పై ఏపీ సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
18.ఈ నెలలోనే శేఖర్ కమ్ముల ‘ లవ్ స్టొరీ ‘

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ లవ్ స్టోరీ ‘ ని ఈ నెల 30 న విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
19.ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీ
ఏపీలో భారీగా ఐపిఎస్ బదిలీ అయ్యారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,760 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,760
.