బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.ఆయన హెలీకాప్టర్ నుంచి జారి కిందపడ్డారు.
మిజోరాం ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మిజోరంలోని ఓ ప్రాంతంలో అమిత్ షా హెలికాఫ్టర్ దిగుతుండగా మెట్లమీది నుండి బొక్కబోర్ల పడ్డాడు.
వెంటనే లేచి అమిత్ షా బట్టలకు ఉన్న దుమ్మును దులుపుకుని మళ్లీ తన ప్రచారం కార్యక్రమానికి చేరుకున్నారు.ఈ ఘటనలో అమిత్ షా కు ఎలాంటి గాయాలు కాలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పార్టీ తరపున ప్రచారం చేసేందుకు అమిత్ షా పశ్చిమ తాయ్పూయ్ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామానికి వెళ్లారు.అక్కడికి వచ్చిన తర్వాత హెలికాప్టర్ దిగబోయిన ఆయన.పొరపాటున ఓ మెట్టు వదిలేశారు.దీంతో అమాంతం నేలపై బోర్లా పడిపోయారు.
అమిత్‌షాతో పాటు హెలికాప్టర్లో వెళ్లిన మరో వ్యక్తి ఆయనను పైకి లేపారు.దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.