కాంగ్రెస్ లో కుర్చీలాట ! రేవంత్ కి వర్కవుట్ అవుతుందా ..?

తెలుగుదేశం పార్టీలో తెలంగాణ కీలక నేతగా తనదైన శైలిలో చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు.ఆ పార్టీలో చేరగానే కీలక పదవి ఆశయించాడు… అధిష్టానం దగ్గరకు వెళ్లి మరీ తన కోర్కెల చిట్టా విప్పి… అన్నిటికి ఆమోద ముద్ర వేయించుకోగలిగాడు.

 Revanth Reddy Strategy For Cm Post In Telangana-TeluguStop.com

ప్రస్తుతము ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయ ఎదుగుదలకు కారణం అయిన టీడీపీని కూడా కూటమిలో చేర్చుకోవడం.

తన రాజకీయ గురువు చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతుండడంతో ఆయన తెలంగాణ సీఎం కుర్చీ మీద ఆశలు పెట్టుకున్నాడు.బలమైన ప్రత్యర్థులుగా ఉన్న కేసీఆర్ – కేటీఆర్ లను విమర్శించి వారిపై పోరాడుతూ వారిని ఎదుర్కునే సామర్ధ్యం ఉన్న నాయకుడు ఒక్క రేవంత్ మాత్రమే అనేలా అధిష్టానం దగ్గర పలుకుబడి సాదించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడు.

తెలంగాణాలో సీఎం పదవే తన లక్ష్యం అన్నట్టుగా… రేవంత్ రెడ్డి 2014 ఎన్నికల నుండి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు.తన రాజకీయ జీవితంలో సీఎం పదవిని అధిష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.ప్రత్యర్థులపై తన పదునైన విమర్శలతో చీల్చి చెండాడే రేవంత్ రెడ్డి మహాకూటమి అధికారంలోకి వస్తే తాను ఏం చేయదల్చుకొన్నాననే అంశాలను మీడియాకు విడుదల చేశారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

ఈ మేనిఫెస్టో కాకుండా రేవంత్ రెడ్డి ఓ డాక్యుమెంట్ ను విడుదల చేయడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది.

పీపుల్స్ ఫ్రంట్ ఉమ్మడి కార్యాచారణను కూడ విడుదల చేసింది.ఈ రెండింటితో పాటు రేవంత్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్ ను అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా అనే చర్చ కూడ లేకపోలేదు.

కలుగుతోంది.

అయితే రేవంత్ రెడ్డి రాజకీయంగా విమర్శలు చేయడమే కాదు పరిపాలన అనుభవం లేదని తనను సీఎం సీటుకు దూరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నవారికి రేవంత్ రెడ్డి డాక్యుమెంట్ రూపంలో చెక్ పెట్టారనే అభిప్రాయాలు కూడ విన్పిస్తున్నాయి.ఎన్టీఆర్, రాజీవ్ గాంధీలు కూడ ఎలాంటి పాలన అనుభవం లేకున్నా అత్యంత ప్రజా రంజకంగా పాలన చేసిన విషయాన్ని రేవంత్ గుర్తు చేస్తున్నారు.ఇప్పటివరకు మంత్రి పదవి రేవంత్ రెడ్డి చేపట్టలేదు.

మంత్రి పదవిని చేపట్టకున్నా ప్రజలకు సేవల చేయాలనే తపన ఉంటే తాను చేస్తాననే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.ఆర్టీసీ, జర్నలిస్టు, పోలీసులతో పాటు మహిళలకు , రైతులకు ఏం చేయనున్నామో రేవంత్ రెడ్డి ఈ డాక్యుమెంట్లో స్పష్టం చేశారు.

పాలన అనుభవం లేదని విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులకు ఈ డాక్యుమెంట్ ద్వారా తాను కూడ సీఎం రేసులో ఉన్నాననని రేవంత్ స్సష్టత ఇచ్చారు.ప్రస్తుతం సీఎం కుర్చీ విషయంలో రేవంత్ దూకుడుగా వెళ్లడం కాంగ్రెస్ సీనియర్లకు మింగుడు పడడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube