తెలంగాణలో కాంగ్రెస్ చేరికల జోష్ లో ఉంది.బిజెపి, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వచ్చి చేరుతున్నారు.
ముఖ్యంగా టిఆర్ఎస్ లోని అసంతృప్త నాయకులు , జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు వరుస వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.ఈ స్థాయిలో కాంగ్రెస్ లోకి చేరికలు చోటు చేసుకోవడం , బిజెపి టిఆర్ఎస్ లకు ఆందోళన కలిగిస్తున్నాయి .పార్టీ నుంచి ఎవరు ఇతర పార్టీలో చేరకుండా టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, బిజెపి చేరికల కోసం ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ ను చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించింది.అయినా కాంగ్రెస్ మాత్రం చేరికలపై ఆశలు పెట్టుకుంది.
బలమైన నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావిస్తుండగా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి చేరికలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.కాంగ్రెస్ లో ఉన్నా, ఆసక్తి లేనట్టుగానే ఉంటున్నారు.
ఎప్పుడో బిజెపిలో చేరాలని ఆయన ప్రయత్నాలు చేసినా, అక్కడి నుంచి ఆయనకు సరైన హామీ లభించకపోవడం, పరిస్థితులు అనుకూలించకపోవడం తదితర కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చారు.

అయితే ఇప్పుడు బిజెపిలో చేరేందుకు సరైన సమయంగా భావిస్తుండడంతో పాటు, కేంద్ర బిజెపి పెద్దల నుంచి ఈ మేరకు రాజగోపాల్ రెడ్డి కి హామీలు లభించినట్లు సమాచారం.ఈ క్రమంలోని ఆయన బిజెపిలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.తాను బిజెపిలో చేరబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించబోయే ముందు తన అనుచరులు, బంధు వర్గంతో చర్చించి, వారిని ఒప్పించి పార్టీ మారాలని చూస్తున్నారట.
ఈ మేరకు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినా, అనారోగ్య కారణాలతో దానిని రాజగోపాల్ రెడ్డి వాయిదా వేశారట.దీంతో మరోసారి కీలక సమావేశాన్ని నిర్వహించి , అధికారికంగా బిజెపిలో చేరబోతున్నట్లుగా రాజగోపాల్ రెడ్డి ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్నారు .భువనగిరి ఎంపీ గారు ఆయన ఉండడంతో పాటు , కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదని, తెలంగాణలోనూ గెలవడం కష్టం అనే అభిప్రాయంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి బిజెపినే టిఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయగలదు అనే నమ్మకంతో ఉన్నారట .అందుకే బిజెపి వైపు వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపించడం తెలంగాణ కాంగ్రెస్ లో ఆందోళన కలిగిస్తుంది.