సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3’.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు.
అలాగే అదనపు ఆకర్షణగా అనిల్ సోనాల్ చౌహన్, పూజా హెగ్డే ను కూడా తీసుకు వచ్చాడు.
దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.
ఈ సినిమా అందరి అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అలాగే తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.థియేటర్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద అలరించడానికి సిద్ధం అయ్యింది.ఈ సినిమాను ఓటిటిలో చూసేందుకు థియేటర్ లో సినిమా చూడని ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాను 8 వారాల తర్వాత ఓటిటి లోకి తీసుకు రావాలని దిల్ రాజు టీమ్ భావించింది.దీంతో ఆలస్యంగా స్ట్రీమింగ్ కు తీసుకు వస్తామని తెలిపారు.
దిల్ రాజు ఇచ్చిన మాట నిలబెట్టుకుని 50 రోజుల తర్వాత ఓటిటిలోకి తీసుకు వచ్చాడు.ఈ రోజు నుండి ఈ సినిమా ప్రేక్షకులను ఓటిటి ప్లాట్ ఫామ్ మీద అలరించ బోతుంది.
అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ను అనుసరిస్తుంది.

అది ఎలా అంటే.భీమ్లా నాయక్ కూడారెండు ఓటిటి లలో ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యింది.రెండు ఓటిటి లలో కూడా మంచి వ్యూస్ తో పాటు రన్ టైం ను కూడా దక్కించు కున్నట్టు టాక్ వచ్చింది.
ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమా కూడా ఒకేసారి రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కు రాబోతుంది.ఎఫ్ 3 సినిమా నెట్ ఫ్లిక్స్ ఇంకా సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
మరి ఎఫ్ 3 ఓటిటిలో కూడా దుమ్ము లేపేస్తుందేమో చూడాలి.







