అది మహిళల హక్కు అని తేల్చిన అమెరికా, మరలా ఆ మాట మార్చుతున్నదేమిటి?

దాదాపు 50 ఏళ్ల క్రితమే అమెరికా( America ) మహిళలకు సంపూర్ణ హక్కులు ఇచ్చి, అబార్షన్( Abortion ) చేసుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత హక్కు అని ప్రకటించేసింది.మరి నేడు ఏమైందో తెలియదు గానీ, దేశవ్యాప్త చట్టంగా అది కుదరదని తీర్పునివ్వడం గమనార్హం.

 America Decided That It Is The Right Of Women, What Is Changing That Again, Woma-TeluguStop.com

దీని పర్యవసానం ఎలాగుందంటే దాన్ని అడ్డుపెట్టుకొని వివిధ రాష్ట్రాలు దీనిపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు.అమెరికాలోని ఫ్లోరిడాలో( Florida ) అబార్షన్ మీద బ్యాన్ విధించింది.

వాళ్లకు సంబంధించిన చట్టసభల్లోనే ఈ విధమైన తీర్మానం చేయడం జరిగింది.

రేసిజం, హోం లెస్ నెస్, పోలీసుల హింస, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులనడుమ ఇబ్బంది పడుతున్న అమెరికా ఆ సమస్యలకు పరిష్కారం చూడడం మానేసి ఆడవాళ్ళ మీద ఆధిపత్యం చేయడం ఏమిటని అక్కడ మహిళా సంఘాలు గళమెత్తుతున్నాయి.తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా 6 వారాల తర్వాత అబార్షన్ చేయించుకోవడానికి అస్సలు కుదరదు అని చెప్తుంది.అసలు ఆరువారాలంటే ఎంత? నెలన్నర కదా.అప్పటికి అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా తెలియదు.

సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియడానికి రెండు మూడు నెలలు దాకా సమయం పడుతుంది.చాలామందికి రెండు మూడు నెలలు పీరియడ్స్ ఆగిపోయాక, ఆ తర్వాత కడుపులో వికారంగా ఉన్నప్పుడు, లేదా వాంతులు అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని గమనిస్తారు.ఆ తర్వాత టెస్ట్ చేసాకగానీ ప్రెగ్నెన్సీ ఉందో లేదో తెలియదు.

అలాంటిది రిపబ్లికన్స్ పాలించే ఫ్లోరిడాలో 6 వారాల్లోనే అబార్షన్ చేయించుకోమని చెప్పడం ఏంటని అక్కడ మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube