రాజకీయ నాయకులు అంటే కేసులు,సిబిఐ ఎంక్వయిరీలు కామనే.కానీ ఈ ఎంక్వైరీల్లో భాగంగా జైలుకు వెళ్లిన సీఎంలు చాలా తక్కువ మంది ఉన్నారు.
ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల పైన ఎక్కువగా ఎంక్వైరీ జరుగుతూ ఉంటాయి.ఆ విధంగానే చంద్రబాబు( Chandra babu ) ను కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ దశ కొనసాగుతోంది.దీంతో మొదట 14 రోజులు రిమాండ్ విధించగా ఆ తర్వాత 11 రోజులు పొడిగించారు.
అయితే ఈయన రిమాండ్ అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది.ఇదే తరుణంలో చంద్రబాబును సిఐడి అధికారులు రాజమండ్రి ( Rajahmundry ) సెంట్రల్ జైల్లోనే ప్రతిరోజు విచారిస్తున్నారు.
మరి ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో చూస్తే కేవలం చంద్రబాబు మాత్రమే రాజమండ్రి సెంట్రల్ జైలు కు వెళ్లారని చాలామంది అనుకుంటారు.చంద్రబాబు కంటే ముందే మరో ఇద్దరు సీఎంలు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలుగా ఉన్నారు.ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi Prakasham Panthulu) కూడా రాజమండ్రి సెంట్రల్ జైలులో జైలు జీవితం అనుభవించారు.
మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రా ఉన్న టైంలో బ్రిటిష్ అధికారులు అప్పుడు ఆయన్ని అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో వేశారు.ఆయనను జైల్లో వేయడానికి ప్రధాన కారణం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం అని తెలుస్తోంది.ఈయననే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి మర్రి చెన్నారెడ్డి ( Marri Chenna reddy) కూడా జైలుకు వెళ్లారు.
ఆయన తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో పాల్గొనడం వల్ల అప్పటి ప్రభుత్వాలు అరెస్టు చేసి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో వేశాయి.