అక్కినేని( Akkineni ) హీరోలకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.గత కొన్నాళ్లుగా నాగార్జున( Nagarjuna ).
నాగ చైతన్య మరియు అఖిల్( Akhil ) ఇలా ముగ్గురు కూడా ప్రతి సినిమా తో నిరాశ చెందుతూనే ఉన్నారు.దాంతో అక్కినేని హీరోల తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు తెర దించే విధంగా నాగార్జున తాజా లుక్ తో మీడియా ముందుకు వచ్చాడు.

ది ఘోస్ట్( The Ghost ) సినిమా తర్వాత నాగార్జున సైలెంట్ గా ఉన్నాడు అంటూ అంతా అనుకుంటున్నారు.కానీ ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna Kumar Bejwada ) దర్శకత్వం లో నాగార్జున హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.ప్రకటన లేకుండానే మొదలు అయిన ఆ సినిమా యొక్క షూటింగ్ అప్డేట్ ఏమీ లేదు కానీ తాజాగా ఒక కార్యక్రమం నిమిత్తం మీడియా ముందుకు వచ్చి అందరిని సర్ ప్రైజ్ చేశాడు.
ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా మూడు పదులే అన్నట్లుగా ఆయన లుక్ ఉంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.అప్పుడు సూపర్ సినిమా లో ఎలా అయితే పొడవు జుట్టు తో స్టైల్ గా కనిపించాడో అదే విధంగా ఇప్పుడు కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ లేక్ కేవలం కొత్త సినిమా కే అయ్యి ఉంటుంది.కనుక నాగ్ కొత్త సినిమా ప్రారంభం అయ్యిందని దీన్ని బట్టి అర్థం అవుతోంది.ఎప్పుడెప్పుడు నాగ్ సినిమా వస్తుందా అంటూ కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నాగార్జున మరియు ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒక హిట్ సినిమా కి రీమేక్ అనే వార్తలు కూడా వస్తున్నాయి.
అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.నాగ్ మాత్రమే కాకుండా అఖిల్ మరియు చైతూ లు ఈ ఏడాది లో కచ్చితంగా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.