ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్న మేజర్ మూవీ.. వైరల్ గా మారిన వీడియో!

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్‌ తాజాగా నటించిన చిత్రం మేజర్. 2008, నవంబర్ 28న ముంబై దాడుల్లో వీర మరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ అయిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు శిఖరం తిక్క దర్శకత్వం వహించారు.పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన విడుదల కానుంది.

 Adivi Sesh Shares Video Audience Gets Emotional Watching Major Movie Details, Major Movie, Adivi Sesh, Major Sandeep Unnikrishnan,, Audience Emotional, Major Movie Preview, Jaipur, Shobita Dhulopalla, Saiee Manjrekar, Adivi Sesh Major Movie-TeluguStop.com

అయితే విడుదలకు ఇంకా పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన నగరాల్లో మేజర్ సినిమా ప్రివ్యూ ప్రదర్శిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే మే 24 నుంచి ఈ మేజర్ సినిమా ప్రివ్యూని ప్రదర్శిస్తున్నారు.

 Adivi Sesh Shares Video Audience Gets Emotional Watching Major Movie Details, Major Movie, Adivi Sesh, Major Sandeep Unnikrishnan,, Audience Emotional, Major Movie Preview, Jaipur, Shobita Dhulopalla, Saiee Manjrekar, Adivi Sesh Major Movie-ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్న మేజర్ మూవీ.. వైరల్ గా మారిన వీడియో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే తాజాగా శనివారం జైపూర్ లో ఒక థియేటర్లో మేజర్ సినిమా ప్రివ్యూ చూసి ప్రేక్షకులు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఆ వీడియోలో పలువురు మహిళలతో పాటు పురుషులు కూడా మేజర్ సినిమా ప్రివ్యూ చూస్తూ కంటతడి పెట్టుకున్నారు.కొంతమంది ఆ సినిమాలో మేజర్ సందీప్ ను చూసి చప్పట్లు కొడుతూ థియేటర్ లోనే స్టాండింగ్ ఒవేషన్ ను ఇచ్చారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోని హీరో అడవి శేష్‌ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

జైపూర్‌ లోని ఒక థియేటర్ లో సినిమా చూస్తూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం తొలిసారి చూస్తున్నాం.మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ అమర్‌ రహై! నా కెరీర్‌లో ఇదో గొప్ప క్షణం అంటూ అడివి శేష్‌ రాసుకొచ్చారు.కాగా జైపూర్‌లో జరిగిన మేజర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కు చూసేందుకు దాదాపుగా 100 మందికి పైగా జవాన్లు థియేటర్‌కు రావడం విశేషం అని చెప్పవచ్చు.

ఈ సందర్భంగా అక్కడి వచ్చిన మేజర్‌ మూవీ టీం జవాన్ లకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం నటి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కి మా బృందం పెద్ద ఫ్యాన్.అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము.

ఆయన అద్భుతమైన వ్యక్తి అంటూ కన్నీటి పర్యంతరం అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube