వీడియో: ఇదెక్కడి దొంగతనం బాబోయ్.. వెళ్తున్న ట్రక్కుపైనుంచి మేకలు విసిరేసాడు..!

కదులుతున్న ట్రక్కు నుంచి రద్దీగా ఉండే హైవేపైకి మేకలను విసిరేంత సాహసోపేతమైన దోపిడీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు అది సినిమాల్లో తప్ప బయట జరుగుతుందా అని సందేహపడకండి.ఎందుకంటే ఇది నిజంగానే జరిగింది.

 A Thief Threw Goats From The Moving Truck Viral In Maharashtra, Stunning Heis-TeluguStop.com

ఈ విచిత్రమైన, షాకింగ్ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గానూ మారింది.దీన్ని చూసిన నెటిజన్లు “వామ్మో ఎన్నో దోపిడీలను చూశాం కానీ ఇలాంటి దోపిడీని ఎక్కడా చూడాలే” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.ఇటీవల మహారాష్ట్ర( Maharashtra )లోని ఇగత్‌పురిలో రద్దీగా ఉండే హైవేపై ట్రక్కు చాలా మేకలతో వెళుతుంది.అయితే ఒక దొంగ ఈ ట్రక్కు పైకి ఎక్కాడు.అనంతరం ట్రక్కులోని మేకలను( Goats ) కిందకు పడేయడం మొదలుపెట్టాడు.

అబ్బురపరిచే ఈ దొంగతనాన్ని తోటి వాహనదారులు కెమెరాలో బంధించారు.ఆ వ్యక్తి ట్రక్కును దిగి, దాని రూఫ్ ద్వారా హోండా సివిక్ సెడాన్‌లోకి దిగడానికి ముందు ఐదు మేకలను కిందకు పడేసినట్లు చూపిస్తుంది.ఆ వ్యక్తి మేకలను దొంగిలించాడా లేక రక్షించాడా అనేది స్పష్టంగా తెలియరాలేదు.

ఈ నిర్లక్ష్యపు చర్య వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.ట్రక్కు ఒకవేళ సడన్‌గా వేగం పెంచినా, లేదంటే అతడు సెడన్ కారు పైనుంచి కాలుజారి కింద పడినా తీవ్ర గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది.ఈ ఘటనకు సంబంధించిన తేదీ వంటి వివరాలు తెలియ రాలేదు.

అయితే ఇది గతంలో అనుకున్నట్లుగా ఉత్తరప్రదేశ్‌లో కాకుండా మహారాష్ట్రలో జరిగిందని ఉన్నావ్ పోలీసులు స్పష్టం చేశారు.ఈ షాకింగ్ దొంగతనానికి సంబంధించిన వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube