బికిని వేయడంలో లేని ఇబ్బంది .బికిని కొసం చేసిన కసరత్తుల వలన వచ్చిందట ఆలియాకి.
పాపం మరీ బక్కగా అయిపోయావని ఆటపట్టిస్తున్నారట అంతా.
షాహిద్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం “షాన్ దార్” .ఇందులో ఆలియా బికిని వేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ సన్నివేశం కోసం ఆలియా చాలా బరువు తగ్గింది.
ఎంతలా అంటే స్నేహితులు అంతా ఎగతాలి చేసేంత.
ఇదే విషయాన్ని ఆలియా చెబుతూ.
‘‘బికినీలో నా శరీరాకృతి బాగుండాలని సన్నబడ్డాను.కానీ, ‘ఏంటి ఇలా అయిపోయావ్? మరీ సన్నబడిపోయావ్’ అని అందరూ అడుగుతుంటే, ఏదో తప్పు చేసినట్టుగా చాలా బాధగా ఉంది.ఏదో రోగిని పరామర్శించినట్లుగా పరామర్శిస్తున్నారు.నాకైతే ఇప్పుడున్న బరువుతో ప్రాబ్లమ్ లేదు.ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా నా ఫిజిక్‌కి సెట్ అవుతోంది.కానీ, అందరూ ‘ఇలా అయిపోయావేంటి?’ అని అడుగుతుంటే, బరువు పెరగాలనిపిస్తోంది” అంటూ తన కష్టాన్ని చెప్పుకుంది ఆలియా.