తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఊర్ల దత్తత విషయమై పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.ఏపీలో తాజాగా టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా భారీ స్థాయిలో ఊర్లను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
మహేష్‌బాబు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంను దత్తత తీసుకుంటాను అంటూ ప్రకటించాడు.అదే విధంగా తెలంగాణలో సైతం మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వెనుకబడిన గ్రామంను మహేష్‌బాబు దత్తత తీసుకోనున్నాడు.
ఇలా గ్రామాలను సెలబ్రెటీలు దత్తత తీసుకుంటున్న నేపథ్యంలో మంచు ఫ్యామిలీ కూడా దత్తతకు ముందుకు వచ్చింది.
చిత్తూరు జిల్లాలోని 10 గ్రామాలను దత్తత తీసుకోవాలని మంచు ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే మంచు ఫ్యామిలీ ఆ 10 గ్రామాలను ఎంపిక చేసే పనిలో పడ్డట్లుగా కూడా టాలీవుడ్ నుండి సమాచారం అందుతోంది.అతి త్వరలోనే మంచు ఫ్యామిలీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ దత్తత విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
మహేష్‌బాబు, మంచు ఫ్యామిలీ ఇలా టాలీవుడ్‌లో అంతా కూడా తమకు తోచిన విధంగా దత్తతకు ముందుకు రావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.‘శ్రీమంతుడు’ సినిమాలో ఒక్క ఊరును దత్తత తీసుకున్నాడు మహేష్‌బాబు.
కాని నిజ జీవితంలో మంచు ఫ్యామిలీ 10 ఊర్లను దత్తత తీసుకుని శ్రీమంతు కాబోతున్నారు.