మనలో చాలా మంది రకరకాలా సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటాం .కొన్ని వింతగా, విచిత్రంగా ఉంటాయి.
కొన్ని నమ్మలేకున్న, ఫాలో అవక తప్పదు.
సూపర్ స్టార్ మహేష్ ఇంతకు ముందు ఓ సెంటిమెంట్ ఫాలో అయ్యేవారు .తన సినిమా టైటిల్ లో మూడు అక్షరాలు ఉండేలా చూసుకునేవారు… అలా హిట్లు కొట్టడం కుడా జరిగింది… మురారి,ఒక్కడు,అతడు,పోకిరి,దూకుడు, ఇలా బ్లాక్బస్టర్ లు ఉన్నాయి .అలా అని చెప్పి అన్ని హిట్లే కాదండోయ్ .ఖలేజా,అతిథి,ఆగడు లాంటి ఫ్లాప్ లు కుడా ఉన్నాయి.ఈ సెంటిమెంట్లు పనికి రావు అనుకున్నారేమో … బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె, శ్రీమంతుడు … ఇలా పొడవైన టైటిల్స్ వైపు రూటు మార్చి హిట్లు అందుకున్నారు.
ఇప్పుడు మహేష్ కి ఇంకో సెంటిమెంట్ కుడా ఉంది … అది కూడా బ్రేక్ అయిపోతే ఉపిరి పీల్చుకుంటాడు సూపర్ స్టార్ … అది ఏంటంటే .మహేష్ సినిమాల్లో తనకి ఒక్కరి కన్నా ఎక్కువ హీరోయిన్లు ఉంటే ఆ సినిమా ఆడకపోవడం.
గమనించి చుడండి … యువరాజు, టక్కరిదొంగ .ఇవి రెండు కుడా కమర్షియల్ గా ఆడని సినిమాలే.మళ్ళి ఇన్నేళ్ళ తర్వాత మహేష్ ఒక్కరి కన్నా ఎక్కువ హీరోయిన్లతో వస్తున్నాడు.
తదుపరి చిత్రం బ్రహ్మోత్సవంలో ఏకంగా ముగ్గురు కథానాయికలు ఉన్నారు .బ్రహ్మోత్సవం పెద్ద హిట్ గా నిలిచి ఈ సెంటిమెంట్ కుడా బ్రేక్ అయిపోతే బాగుంటుంది.