మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ లకు నటీనటులకు కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు( Dubbing artists ) డబ్బింగ్ చెబుతారు అన్న విషయం తెలిసిందే.అందులో కొంతమంది మాత్రమే మనకు తెలుసు.
తిరుపతికి కనిపించిన వారు కొంతమంది ఉంటే తెరపై కనిపించని వారు ఎంతో మంది ఉన్నారు.కొంతమంది హీరోయిన్లకు అబ్బాయిలు కూడా డబ్బింగ్ చెబుతారు అన్న విషయం చాలామందికి తెలియదు.
వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.అలా హీరోయిన్లకు వాయిస్ ఇచ్చే ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎంబీబీఎస్ చేసిన ఆద్య హనుమంత్ ( Adya Hanumanth )ఇప్పటి వరకు సమంత, సాయి పల్లవి, అవికాగోర్( Samantha, Sai Pallavi, Avikagore ).ఇలా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాడు.
ఇప్పటి వరకు 175 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన ఆద్య హనుమంత్ తెలంగాణ లోని మహబూబ్ నగర్ వాసి.కర్ణాటక లోని రాయచూరులో ఉంటున్న ఆద్య హనుమంత్ కి ఇలాంటి క్రేజీ వాయిస్ ఎలా అబ్బిందో, సినిమాలకు స్పెషల్ వాయిస్ ఆర్టిస్ట్ గా ఎలా మారారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ సందర్భంగా ఆధ్య హనుమంత్ మాట్లాడుతూ.నా వయసు ఇప్పుడు 22 ఏళ్లు.పదమూడేళ్ల వయసు నుంచి డబ్బింగ్ చెబుతున్నాను.స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు నా వాయిస్ బాగుంటుందని సీరియల్స్ లోని చైల్డ్ ఆర్టిస్టులకు ( child artists )డబ్బింగ్ చెప్పించేవారు.
తర్వాత హీరోయిన్లకు నా వాయిస్ కనెక్ట్ అయ్యింది.సాధారణంగా ఇతర భాషల్లోని డబ్బింగ్ ఆర్టిస్టులు మన దగ్గర ఫేమస్‌గా ఉంటారు.

నేను మాత్రం తెలంగాణ నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను.సమంత, సాయిపల్లవి, ఐశ్వర్య, అవికా గోర్ ఇలా ప్రముఖ హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పాను.నా గొంతు అమ్మాయిల మాదిరి ఉంటుందని, మరింత స్పెషల్‌గా ఉంటుందని అంతా అంటుంటారు.ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు.అదంతా దేవుడి దయ.ఇష్టమైన పని కావడంతో డబ్బింగ్, చదువు రెండింటినీ ప్రేమిస్తాను.కష్టంగా ఉన్నా ఒక పూట తిండి అయినా మానేస్తాను.కానీ చదువుతో పాటు డబ్బింగ్ కూడా నాకు ప్రాణమే.
ఎప్పుడు ఈ గొంతు మారబోతుందో చెప్పలేను.కానీ ప్రేక్షకులు ఎంత కాలం కోరుకుంటే అంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతాను.
ప్రత్యేకించి ప్రాక్టీస్ ఏమీ ఉండదు.డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం పలికిస్తాను.

అది అందరినీ ఆకట్టుకుంటుంది.ఆడపిల్లలా ఆ గొంతేంటి? అని వేళాకోలం అడినవారు ఉన్నారు.మొహమ్మీదనే చులకనగా మాట్లాడిన వారూ ఉన్నారు.కానీ, మా అమ్మ ఒకసారి చెప్పింది.దేవుడు, నీకు మాత్రమే ఇంత ప్రత్యేకత ఎందుకిచ్చాడో గమనించు.మనం చేయాలనుకున్న పని సాధారణంగా ఉండకూడదు.
ఎంత రిస్క్ అయినా ఒక్క అడుగు ముందుకే వేసి చూడు అని చెప్పేది.ఆ మాటలు నాకు ఈ రోజు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు హనుమంత్.