అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన ఓ తెలుగు విద్యార్ధి ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని హైదరాబాద్ ఉప్పల్‌లోని ధర్మపురి కాలనీకి చెందిన పాల్వాయి ఆర్యన్ రెడ్డిగా (23)( Palvai Aryan Reddy ) గుర్తించారు.ఇతను జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గతేడాది డిసెంబర్లో పై చదువుల కోసం అమెరికాకు( America ) వెళ్లిన ఆర్యన్ .ఈ నెల 13న తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు.ఆ కాసేపటికే ఆర్యన్ రూమ్ నుంచి కాల్పుల శబ్ధం వినిపించడంతో స్నేహితులు వెళ్లి చూసేసరికి అతను రక్తపు మడుగులో శవమై కనిపించాడు.
తుపాకీని( Gun ) క్లీన్ చేస్తుండగా పొరపాటున అది పేలి ఆర్యన్ రెడ్డి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
![Telugu Geeta, Gun Misfire, Hyderabad, Indian, Kansas, Shoots, Sudarshan Reddy, T Telugu Geeta, Gun Misfire, Hyderabad, Indian, Kansas, Shoots, Sudarshan Reddy, T](https://telugustop.com/wp-content/uploads/2024/11/Indian-student-from-hyderabad-accidentally-shoots-himself-in-US-detailss.jpg)
ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో ఆర్యన్ తల్లిదండ్రులు సుదర్శన్ రెడ్డి, గీతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఆర్యన్‌కు ఆర్మీలో పనిచేయాలని ఎంతో ఇష్టమని, కానీ తాము అతనికి నచ్చజెప్పి అమెరికా పంపినట్లు సుదర్శన్ రెడ్డి( Sudarshan Reddy ) పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితమే ఆర్యన్ హంటింగ్ గన్ లైసెన్స్ తీసుకున్నాడని ఆయన వెల్లడించారు.
ఆర్యన్ రెడ్డి మృతదేహం త్వరలోనే భారతదేశానికి రానుండగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
![Telugu Geeta, Gun Misfire, Hyderabad, Indian, Kansas, Shoots, Sudarshan Reddy, T Telugu Geeta, Gun Misfire, Hyderabad, Indian, Kansas, Shoots, Sudarshan Reddy, T](https://telugustop.com/wp-content/uploads/2024/11/Indian-student-from-hyderabad-accidentally-shoots-himself-in-US-detailsd.jpg)
ఇకపోతే.గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లినవారిలో 51 శాతం మంది తెలుగు విద్యార్ధులే కావడం గమనార్హం.హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో రోజుకు సగటున 1600 వీసాలు ప్రాసెస్ చేస్తున్నట్లు యూఎస్ కాన్సులర్ జనరల్ (హైదరాబాద్) రెబెకా డ్రామ్ మీడియాకు తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి సిబ్బందిని పెంచి రోజుకు 2500 వీసాలు ప్రాసెస్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.